Saturday, 7 November 2026

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభను, భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభను, భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి
◆◆◆◆◆ మహా సభ కు హాజరుకానున్న కేరళ ముఖ్యమంత్రి విజయన్

◆◆◆◆◆ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్.

ఈనెల 29,30,31తేదీలలో ఖమ్మంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం మానకొండూరు మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాయికంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా కేరళ ముఖ్యమంత్రి కామ్రేడ్ విజయన్ హాజరవుతున్నారని తెలిపారు. మహాసభల్లో వ్యవసాయ కూలీలు,కార్మికులు,పేద రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ మాహాసభల్లో వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చర్చించి,రానున్న మూడు సంవత్సరాల కాలంలో భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తామని అన్నారు . అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. రోజు,రోజు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గించి,పేదలకు అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ కూలీలకు కనీస వేతనం రోజుకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ తో ఈ మహాసభలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.
కార్మిక సంఘాలు,వామపక్ష పార్టీలు పోరాటం చేసి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా 333 జీవో తెచ్చి ఉపాధి కూలీల పొట్ట కొట్టాలని బిజెపి ప్రభుత్వం కుతంత్రాలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ నిధులను ఇతర పనులకు కేటాయించడం సరైనది కాదన్నారు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని సూచించారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బొగ్గుల రాధిక,నెల్లి ప్రమీల,బొగ్గుల పద్మ,నెల్లి అంజలి,సరళ,గట్టు శిరీష తదితరులు పాల్గొన్నారు.