Thursday, 5 November 2026

కాంగ్రెస్‌,టిడిపిల్లో చల్లారని అసమ్మతి

గాంధీభవన్‌, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ల ముందు నిరసనలు

ఖానాపూర్‌ రాథోడ్‌కు కేటాయించవద్దని నిరసనలు

ఎల్బీనగర్‌ టిడిపికే ఉండాలని సామరంగారెడ్డి వర్గం ఆందోళన

హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందే కాంగ్రెస్‌ పార్టీలో చెలరేగిన అసమ్మతి చల్లారడం లేదు. అటు ఢిల్లీ, ఇటు మైదరాబాద్ల్‌ఓ నిరసనలు కొనసాగుతున్నాయి.

మహాకూటమి పొత్తులో మిత్రపక్షాలకు తమ నియోజకవర్గాలను కేటాయించవద్దంటూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో గాంధీభవన్‌ వద్ద వరుసగా రెండోరోజు వనివారం కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

గాంధీభవన్‌ వద్ద రెండో రోజు కూడా కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఓవైపు మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ తర్జనభర్జన పడుతూ ఉండగా మరోవైపు పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించినట్లు ప్రచారంలోకి వచ్చిన స్థానాలపై సొంతపార్టీ నేతల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని స్థానాల్లో తమ నేతలకు టికెట్లు ఇవ్వాల్సిందే అని పలువురు నేతలు పట్టుబడు తున్నారు. ఈ క్రమంలో నిన్న మల్కాజ్‌గిరి టికెట్‌ టీజేఎస్‌కు కాకుండా కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధర్‌కు ఇవ్వాలంటూ గాంధీభవన్‌ ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగగా, ఈరోజు ఖానాపూర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ ధర్నాకు దిగారు. ఖానాపూర్‌ టికెట్‌ రమేష్‌ రాథోడ్‌కు ఇస్తారన్న వార్తలపై వారు ఆందోళన చేపట్టారు. రమేష్‌ రాథోడ్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. వీరితో చర్చలు జరిపి నిరసనను విరమింప జేసేందుకు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, గూడూరు నారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆందోళన కారులను అడ్డుకునేందుకు గాంధీభవన్‌ ప్రైవేటు భద్రతా సిబ్బంది గేట్లకు తాళాలు వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. గాంధీభవన్‌లోనికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరికి గాంధీభవన్‌ గేట్లకు తాళాలు వేయడంతో మెట్లపై కూర్చొని నిరసన తెలిపి వెళ్లిపోయారు. మహాకూటమి పొత్తులో భాగంగా తమ స్ధానాన్ని ఇతరులకు కేటాయించవద్దని ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పసుడు ఈ సెగ ఎన్టీఆర్‌ భవన్‌కు కూడా చేరింది. శనివారం ఎన్టీఆర్‌ భవన్‌ ఎదుట తెదేపా నేతలు ఉదయం ఆందోళనకు దిగారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు కేటాయించవద్దని తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్‌ టికెట్‌ను తమకే కేటాయించాలని సామ రంగారెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు ఎలా ఈ నియోజకవర్గాన్ని కేటాయిస్తా రంటూ ప్రశ్నించారు. తాము ఈ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకున్నామని.. అలాంటి స్థానాన్ని వేరే పార్టీకి కేటాయిస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఈ టికెట్‌ను తమకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సామ రంగారెడ్డితోపాటు ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్థిగా బిసిస సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య గెలుపొందారు. తెలంగాణ మహాకూటమి సీట్ల కేటాయింపులో భాగంగా ఎల్బీనగర్‌ టికెట్‌ తమ నేతకే కేటాయించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. సామరంగారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఈ స్థానం నుంచి ఆర్‌.కృష్ణయ్య ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందారు. కాగా ప్రస్తుతం తెలంగాణ మహాకూటమి సీట్ల కేటాయింపులో ఎల్బీనగర్‌ టీడీపీ సిట్టింగ్‌ స్థానాన్ని సామరంగారెడ్డికే ఇవ్వాలని అనుచరులు పట్టుబడుతున్నారు.