హైదరాబాద్,నవంబరు 19(జనంసాక్షి):
కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకుతెరాస, భాజపాలు కుట్ర చేస్తన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సమా జాన్ని చీల్చేందుకు తెరాస అధినేత కేసీఆర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ఇద్దరూ కలిసి ఎంఐఎంను ఆటవస్తువుగా మా ర్చుకు న్నారని విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వ హించిన విూడియా సమావేశంలో రేవంత్ మా ట్లాడారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా భాజపా అ ధికా రంలోకి వచ్చేందుకు మజ్లిస్ సంపూర్ణ సహకారం అందిస్తోందని.. దీనికి తెరాస సమ న్వయం చేస్తోందని వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు. ఎంఐఎం అధినేత, ఎంపీ
భాజపా, ఎంఐఎంది తెరముందు కుస్తీ.. తెరవెనుక దోస్తీ అని రేవంత్ ఆరోపించారు. హిందుత్వ పార్టీ అని చెప్పుకొనే భాజపా నేతలు.. సచివాలయంలో వందేళ్ల చరిత్ర కలిగిన నల్లపోచమ్మ గుడిని కూల్చివేస్తే ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ‘బస్తీ హమారా-బల్దియా హమారా’ అనే నినాదంతో కాంగ్రెస్ పోరాడుతుందని రేవంత్ చెప్పారు.అసదుద్దీన్ జైలుకు వెళ్తే బెయిల్ ఇప్పించింది దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావేనని చెప్పారు.




