Friday, 6 November 2026

కాంగ్రెస్‌ అంతుచూస్తాం

 

గాంధీభవన్‌ ముందు యాదవసంఘాల ఆందోళన

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అంతు చూస్తామని యాదవసంఘం నేతలు ఘాటుగా హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతలు టిక్కెట్లు అమ్ముకుని తమ కులాలను నిర్లక్ష్యం చేశాయని అన్నారు. వారికి గట్టిబుద్ది చెబుతామని అన్నారు. కాంగ్రెస్‌ మూడో జాబితా విడుదలయ్యాక మరోసారి గాంధీభవన్‌ దగ్గర ఉద్రిక్తత కొనసాగింది. తెలంగాణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గేట్లు ఎక్కి దూకేందుకు యత్నించారు. యాదవ సామాజిక వర్గానికి కాంగ్రెస్‌ అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. ఉత్తమ్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పొత్తులో భాగంగా ముఖ్యమైన సీట్లను ఇతర పార్టీలకు ఇచ్చారని వారు మండిపడ్డారు. కేవలం రెడ్డివర్గం వారే టిక్కెట్లు దక్కించుకుని తమలాంటి బలహీనవర్గాలను పక్కన పడేశారని అన్నారు.