– మోదీపై అవినీతి ఆరోపణలు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు
– అవినీతిని అరికట్టడంలో కేంద్రం రాజీ పడటం లేదు
– రాహుల్ ఎక్కడ తిరిగినా కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు లేవు
– కేంద్రాన్ని ఢిల్లీలో పొగడటం, రాష్ట్రంలో తిట్టడం కేసీఆర్‌కు అలవాటుగా మారింది
– తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబ పాలన కోసం కాదు
– వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం
– విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్, ఆగస్టు14(జనం సాక్షి) : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణాలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. రాహుల్ మాట్లాడుతున్న తీరు నిరాశ నిస్పృహలను స్పష్టం చేస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల్లో తుడుచిపెట్టుకుపోయిన పార్టీ తెలంగాణలో ఏమో చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధాని మోడీపై అవినీతి ఆరోపణలు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు అని విమర్శించారు. అవినీతి విషయంలో మోడీ ప్రభుత్వం రాజీ పడడం లేదని ఆయన తెలిపారు. రాహుల్ ఎక్కడ తిరిగినా కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు లేవని లక్ష్మణ్ అన్నారు. హైద్రాబాద్ లో ఉన్న రోహింగ్యాలపై, త్రిబుల్ తలాక్ విషయంలో విూ వైఖరి ఏంటిని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణాలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని లక్ష్మన్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ వచ్చేది లేదు కానీ సచ్చేది మాత్రం ఖాయమన్నారు. అమర వీరులకు నివాళులు అర్పించడం కాదు.. ముందు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ కు
ఢిల్లీలో మోడీని మెచ్చుకోవడం.. హైదరాబాద్ వచ్చి విమర్శలు చేయడం అలవాటు అయిందని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ వచ్చింది విూ కుటుంబ పాలన కోసం కాదని ధ్వజమెత్తారు. కాపలా కుక్కలా ఉంటానని చెప్పి.. దళిత జాతికి ద్రోహం చేశారని తెలిపారు. తెలంగాణ వచ్చింది విూ కుటుంబంలోని నలుగురి కోసమేనా అని తెలంగాణ ప్రజలు బాధ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మతోన్మాద మజ్లీస్ పార్టీకి కాంగ్రెస్, తెరాస పార్టీలు తొత్తులుగా మారాయన్నారు. 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో.. ఈ నాలుగు సంవత్సరాల మోడీ పాలనలో వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు. కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం రావడం ఖాయం అని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జరిగేవి జమిలీ ఎన్నికలేనని, ముందస్తు పేరుతో ఎన్నికలకు పోవాలనుకుంటున్న కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయం అని లక్ష్మణ్ అన్నారు.
—————————————–
కాంగ్రెస్ నేతలవి పగటి కలలే




