దానం నాగేందర్ గుడ్ బై
– రాజీనామా లేఖను రాహుల్, ఉత్తమ్‌కు పంపిన దానం
– కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నాగేందర్
– తనకు చెప్పకుండానే గ్రేటర్‌లో పదవులు ఇవ్వటంపై మనస్థాపం
– భవిష్యత కార్యాచరణపై నేడు అనుచరులతో సమావేశం
– తెరాస తీర్థం పుచ్చుకొనే అవకాశం
– దానంను బుజ్జగించేందుకు కాంగ్రెప్ ప్రయత్నాలు
– దానం ఇంటికి వెళ్లిన ఉత్తమ్
– అందుబాటులో లేకపోవటంతో ఫోన్‌లో మాట్లాడిన టీపీసీసీ చీఫ్
– రాజీనామా నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచన
హైదరాబాద్, జూన్22(జనం సాక్షి) : కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ మహానగరంలో పార్టీకి కీలక వ్యక్తిగా ఉన్న మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌కు కూడా పంపినట్టు తెలిపారు. కాగా శనివారం విూడియా సమావేశం నిర్వహించి తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వెల్లడిస్తానని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే దానం పార్టీ మారుతారని గత కొంతకాలంగా పుకార్లు సికార్లు చేస్తూనే ఉన్నాయి. కాగా వాటిని దానం ఖండిస్తూ వస్తున్నప్పటికీ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ పదవుల పంపకం విషయంలో రాష్ట్రానికి సంబంధించి విస్తరిస్తారని, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తనను నియమిస్తారనే ఆశతో ఆయన ఎదురు చూశారు. అంతేకాకుండా ఆ పదవి కోసం ఆయన ప్రయత్నించినప్పటికీ నేటికీ సానుకూల ప్రకటన రాకపోవడంతోనే ఆయన రాజీనామా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే, కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్న తనకు చెప్పకుండానే ఆ పదవిని అంజన్‌కుమార్ యాదవ్‌ను అప్పగించారని, అదంతా తనకు తెలియకుండానే జరిగిపోయిందని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఆయన పార్టీని వీడతారంటూ వూహగానాలు వచ్చాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందును కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన సందర్భంలో ఆ కార్యక్రమానికి దానం నాగేందర్ హాజరయ్యారు. అయితే, అప్పట్లో వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించిన విషయం తెలిసిందే. గవర్నర్‌తో తనకున్న సాన్నిహిత్యం కారణంగానే ఆ విందుకు హాజరైనట్లు ఆయన వివరణ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం పరేడ్ గ్రౌండ్ లో దానం ఆధ్వర్యంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఇందుకు సీఎంను కేసీఆర్ ను ఆహ్వానించి ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు దానం. అప్పటి నుంచే టీఆర్‌ఎస్ లో చేరుందుకు దానం ప్రయత్నాలు షురూ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే దానం విషయంలో సీఎం అంత పాజిటివ్ గా లేరనే డిస్కషన్ పొలిటికల్ సెక్టార్లో నడుస్తూ వచ్చింది. ఇంత జరుగుతున్నా దానంతో పాటు కాంగ్రెస్ నేతలు మాత్రం దానం విషయంలో అలాంటిదేంలేదని చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో గ్రేటర్ హైదరాబాద్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది.
దానంను బుజ్జగించిన ఉత్తమ్..
దానం నాగేందర్ రాజీమాతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వెంటనే స్పందించారు. దానంను బుజ్జగించేందుకు ఉత్తమ్ నేరుగా దానం ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ దానం లేకపోవటంతో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీకి రాజీనామాను వెంటనే వెనక్కు తీసుకోవలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే కలిసి మాట్లాడుకుందామని, అదిష్టానంతో చర్చించి తమ ఇబ్బందులను తొలగించుకుందామని దానంను ఉత్తమ్ బుజ్జగించారు. కానీ దానం తాను అన్ని ప్రయత్నాలు చేసిన తరువాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నాని తెలిపినట్లు సమాచారం. దీంతో తొందరపడి నిర్ణయం తీసుకోవటం మంచిదికాదని మరోసారి పునరాలోచించుకోవాలని దానంకు ఉత్తమ్ సూచించినట్లు తెలుస్తోంది.
తెరాసలోకి దానం?
కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసిన దానం తదుపరి కార్యాచరణపై శనివారం విూడియాకు వెల్లడిస్తానని పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు తన అనుచరులతో భేటీ అయిన దానం మరోమారు శనివారం భేటీ అయ్యి తదుపరి కార్యాచరణపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే దానం తెరాసలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొంత కాలం నుంచి ఆయన టీఆర్‌ఎస్ లో చేరేందుకు చేయాల్సిన యత్నాలన్నీ చేస్తున్నా గులాబీ నేతలు వద్దంటున్నట్టు టాక్ వనిపించింది. కొద్ది రోజుల క్రితం పరేడ్ గ్రౌండ్ లో దానం ఆధ్వర్యంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఇందుకు సీఎంను కేసీఆర్ ను ఆహ్వానించి ఆశీర్వాదాలు కూడా దానం తీసుకున్నారు. అప్పటి నుంచే టీఆర్‌ఎస్ లో చేరుందుకు దానం ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది. అయితే దానం విషయంలో సీఎం అంత పాజిటివ్ గా లేరనే డిస్కషన్ పొలిటికల్ సెక్టార్లో నడుస్తోంది. కాగా టీఆర్‌ఎస్ లో చేరేందుకు ఎంపీ కేకేతో మధ్యవర్తిత్వం నడిపినట్లు ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ లో ఉన్నపుడు దానంకు కేకేకు మధ్య మంచి సంబంధాలున్నాయి. అయితే దానం విషయంలో కేకే సూచనలను కూడా కేసీఆర్ లైట్ తీసుకున్నట్టు ప్రచారం నడిచింది. కాగా మళ్లీ తెరాస నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో దానం తెరాస తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేడు అనుచరులతో సమావేశం అనంతరం దానం నాగేందర్ తెరాసలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి..




