Friday, 6 November 2026

కాంగ్రెస్‌ పార్టీకి కార్తీక్‌ రెడ్డి రాజీనామా!

– రాజేంద్రనగర్‌ టికెట్‌ దక్కకపోవటంతో ఆగ్రహం

– శంషాబాద్‌ కాంగ్రెస్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు

– 19లోగా బీఫాం ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతా

– స్పష్టం చేసిన పటోళ్ల కార్తీక్‌ రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌15(జ‌నంసాక్షి) : మహాకూటమి సీట్ల సర్దుబాటు నేపథ్యంలో కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు మరింత రాజుకున్నాయి. తనకు రాజేంద్రనగర్‌ టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్‌ రెడ్డి ప్రకటించారు. మహాకూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్‌ స్థానం తెదేపాకు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ

స్థానం నుంచి తెదేపా నుంచి గణెళిశ్‌ గుప్తా బరిలో ఉన్నారు. దీంతో ఎప్పటినుంచో ఆ టికెట్‌ ఆశిస్తున్న కార్తీక్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గురువారం శంషాబాద్‌లో నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌కు టికెట్‌ కేటాయించకపోవడాన్ని తప్పుపడుతూ ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ తమకు బీఫాం ఇస్తే రాజీనామాలను ఆమోదించనట్టు అని.. ఒకవేళ ఇవ్వకపోతే తమ రాజీనామాలను ఆమోదించినట్టేనన్నారు. ఈ నెల 19లోపు తనకు బీఫాం ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు కార్తీక్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వాలంటూ ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. శంషాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తు పేరు చెప్పి టీడీపీ దరిద్రం కాంగ్రెస్‌ కు అంటించారని ఉత్తమ్‌ కుమారెడ్డిపై నిప్పులు చెరిగారు. 40 మంది కార్యకర్తలు కూడా లేని టీడీపీకి రాజేంద్రనగర్‌ సీటు కేటాయిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతోందనీ, కాలాన్ని వృధా చేయకుండా కార్తీక్‌ రెడ్డికి టికెట్‌ కోసం వేలాదిగా గాంధీభవన్‌ ముట్టడించాలని మన పోరాటం ఢిల్లీకి తాకి పునరాలోచించాలని కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజేంద్ర నగర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షడు శ్రీనివస్‌ గౌడ్‌ అధ్యక్ష పదవికి రాజీనామచేశారు. కార్తీక్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే లక్ష ఓట్లతో రాజేంద్ర నగర్‌ గెలుస్తారని, లేదంటే ప్రచాకటరకమిటీ సభ్యత్వంతో సహా అన్ని పదవులకు కార్తీక్‌ రెడ్డి ,రాజేంద్రనగర్‌ కార్యకర్తలు రాజీనామా చేస్తామని, కూర్చొని మాట్లాడితే కాదు, రోడ్లపైకి వెళ్లి ఎక్కడిక్కడ స్తంభింపచేయాలని ఇంతమంది కార్యకర్తలను రోడ్డు విూద పడేసినందుకు ఉత్తమ్‌ కుమారెడ్డికి ధన్యవాదాలని ఎద్దెవ చేశారు. కార్తీక్‌ రెడ్డి ఏం నిర్ణయం తీసుకున్నా ఆయనవెంటే ఉంటామని ప్రకటించారు,ఇండిపెండెంట్‌ గా పోటీ చేసేందుకు సైతం సిద్దపడాలని అవసరమైతే సబితమ్మ కూడా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌ గా ఇద్దరు బరిలో నిలవాలని ఇద్దరినీ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. కాగా కార్తీక్‌ రెడ్డి రాజీనామాపై ఇప్పటి వరకు కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి స్పందన ఇవ్వలేదు.