హుజూర్ నగర్‌లో వారికి ఓటమితప్పదు: కర్నె
నల్లగొండ,అక్టోబర్4 (జనంసాక్షి): కాంగ్రెస్ హయాంలో 35వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మరచిన ఆ పార్టీ నేతలు టిఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. గతంలో వారు చేసిన తప్పులను సరిదిద్దుతూ రైతు సంక్షేమ కార్యక్రమాలను సిఎం కెసిఆర్
పెద్ద ఎత్తున చేపట్టారని అన్నారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్చేస్తున్ ఆరోపణల్లో పసలేదన్నారు. కాంగ్రెస్ గెలిచి ఒరగబెట్టిందేమిటని అన్నారు. టిఆర్‌ఎస్ గెలిస్తేనే ఈ ప్రాంతానికి న్యాయం జరగ్గలదన్నారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల పునర్నిర్మాణం తదితర అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గజ్వేల్ ప్రాంతంలో మూడో పంటకు నీరిచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. మల్లన్న సాగర్‌తో గోదావరి జలాలను రప్పించే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం వారి దుర్నీతి తప్ప మరోటి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటోందని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలకు గత పదేళ్ళ పాపాలు గుర్తుకు రావడం లేదన్నారు.
కాంగ్రెస్ మొసలి కన్నీరు




