న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయంపై ప్రధాని మన్మోహన్‌సింగ్ హర్షం వ్యక్తంచేశారు. ఈ విజయంలో పార్టీ యువనేత రాహుల్‌గాంధీ కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు. కర్ణాటక ఎన్నికలపై ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కర్ణాటకలో గెలుపుబాటలో ముఖ్యపాత్ర పోషించిన రాహుల్‌గాంధీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.




