దౌల్తాబాద్ జూన్ 6, జనం సాక్షి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరములోకి అడిగి పెట్టిన శుభ సందర్బంగా జూన్ 2నుంచి తెలంగాణ ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాల వాల్ పోస్టర్ ను బి ఆర్ ఎస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం నాయకులుప్రజాహిత ఫౌండేషన్ చైర్మన్ మామిడి మోహన్ రేడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించడానికి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రము చేయని అభివృద్ధి,సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. దేశానికె తెలంగాణ అన్నపూర్ణగా నిలిచిందని అన్నారు.దుబ్బాక నియోజకవర్గం లోని ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలను వివరిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ ని అధికారంలోకి తీసుకొస్తామని అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని అన్నారు.
దశాబ్ది ఉత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మామిడి మోహన్ రెడ్డి.




