ఏర్గట్ల మే 24 (జనంసాక్షి) నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో పంట పొలాల గ్రామాల మధ్యలో ఉన్న జియో స్టోన్ క్వారీ క్రషర్ తక్షణమే మూసివేయాలని ప్రజలకు సంబదించిన ప్రకృతి వనరులను కాపాడాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామములో ఉన్న క్వారీ మరియు క్రషర్లను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చని పంట పొలాల మధ్యలో గ్రామాల మధ్యలో ఎలాంటి క్వారీలను గాని క్రషర్లను గాని నడపకూడదని పర్యావరణానికి సంబంధించి మైనింగ్ చట్టం లో ప్రాథమిక సూత్రం అమలులో ఉన్నప్పటికీ వాటిని తుంగలోకి తొక్కి క్వారీ మరియు క్రషర్ పేరుతో అధికార అండదండలతో మైనింగ్ అవినీతికి పాల్పడుతున్న వారిపైచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం 13వేల వేల క్యూబిక్ మీటర్ల మైనింగ్ కొరకే అనుమతి తీసుకున్నప్పటికీ కానీ ఇప్పటికే దాదాపు 15 లక్షల క్యూబిక్ మీటర్ల లోతుకు మైనింగ్ చేశారని ఆయన ఆరోపించారు. అక్రమ క్వారీ మైనింగ్ ద్వారా చుట్టుపక్కల పంట పొలాలు నాశనం అవ్వడమే కాకుండా పర్యావరణం కూడా దెబ్బతింటుందని గ్రామాలలో దుమ్మి దూళి వస్తుందని పెద్ద పెద్ద బ్లాస్టింగ్ శబ్దాలతో భయబ్రాంతులకు గురి అవుతున్నారని గత నాలుగు సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు,ప్రజాసంఘాల నేతలు,గగ్గోలు పెడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏలాంటి స్పందన లేకపోవడంతో ఇదే అంశాన్ని క్వారీ నిర్వాహకులతో మాట్లాడదామని కాంగ్రెస్ పార్టీ పక్షాన తాము ఇక్కడికి వస్తే కేవలం రెండు నిమిషాల్లోనే పోలీసులు ఇక్కడ ప్రత్యక్షమయ్యారని, ఈ క్వారీ అనుమతులకు మించి మైనింగ్ కి పాల్పడుతూ సహజ వనరులను దోచుకుంటూ ప్రభుత్వానికి రావలసిన పన్నులను ఎగ్గొడుతున్నారని ఆయన మండిపడ్డారు.నిబంధనలను తుంగలో తొక్కి నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ అక్రమ మైనింగ్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోమా దేవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు వరదబట్టు వేణు రాజ్ ,మండల కాంగ్రెస్ వేల్పూర్ అధ్యక్షులు నర్సారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఫీ, జిల్లా జనరల్ సెక్రెటరీ దాము లింగ రెడ్డి ,వెంకట్ రెడ్డి గడ్డం జీవన్, లోలపు రాజు, కౌడ భూమేష్, మున్నిరోద్దిన్, మహేష్ యాదవ్, వంకాయల వెంకటరెడ్డి, కొర్రీ లింగారెడ్డి,హన్మంత్ రెడ్డి, దాసరి సాయన్న, బద్దం కిషన్, అరపు ముణిక్యం, నవీన్,తదితరులు పాల్గొన్నా
కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్రషర్ పరిశీలన




