Wednesday, 4 November 2026

జలల్ పూర్ లొ కొత్తగా మంజూరు అయినా వృద్దప్యా పెన్షన్ లు అందజేత

బాల్కొండ మే 24 (జనం సాక్షి ) బాల్కొండ మండలం జలాల్ పూర్ గ్రామంలో కొత్తగా మంజూరు అయిన వృద్ధాప్య పెన్షన్ ను బుధవారం లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ గడ్ చoదా కల్పన-అనిల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. జలాల్ పూర్ గ్రామా లబ్ధిదారులు సుద్ధపల్లి లసుంబాయి, కస్తూరి లక్ష్మీబాయి , సయ్యద్ జమీలాభి లకు పెన్షన్ ఇవ్వడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ వృద్ధాప్యంలో పెన్షన్ ఎంతో ఆసరా అవుతుందని లబ్ధిదారులు సీఎం కేసీఆర్,మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింభారెడ్డి ,వార్డు సభ్యులు శేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్, పోస్టుమాన్ రాజు, పాల్గొన్నారు.