Wednesday, 4 November 2026

జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది -ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.

 

గద్వాల నడిగడ్డ, మే 25 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి,మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ కి జోగుళాంబ గద్వాల జిల్లా జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.
జిల్లాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే, ఛైర్మన్ గార్లు కు వినతిపత్రం అందజేశారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈసందర్భంగా నూతన జర్నలిస్టు హౌసింగ్ సోసైటీ కార్యవర్గాని ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు హౌసింగ్ సోసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.