కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే!?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. టీపీసీసీ జనరల్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అశ్వారావుపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు తాటి వెంకటేశ్వర్లు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే, తాటి వెంకటేశ్వర్లుతో మంత్రి హరీష్ రావు టచ్‌లోకి వెళ్లారు. వెంకటేశ్వర్లుతో మంతనాలు జరిపారు హరీష్ రావు.