భైంసా రూరల్ జూలై 07 జనం సాక్షి- కాంగ్రెస్ రాష్ట్ర వ్యవరాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే తో ఇప్పటికే చరవాణిలో సంభాషించినట్లు సమాచారం.- మహారాష్ట్ర బంధువుల నుండీ మధ్యవర్తిత్వం…- రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాలుకా లో రసవత్తరంగా మారునున్న రాజకీయం…ముధోల్ రాజకీయంలో రోజుకో తీరు రాజకీయ పరిమాణాలు చోటుచేసుకు0టున్నాయి. తాజాగా కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే బోస్లె నారాయణరావు పటేల్ చేరుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవరాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే తో చరవాణిలో సంభాషించినట్లు సమాచారం.సుదర్శన్ రెడ్డి,రామచందర్ రెడ్డి తో సైతం టచ్ లో వున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే శ్రావణమాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి పటేల్ రెడీ అయ్యారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ముధోల్ రాజకీయంలో ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న నారాయణరావు పటేల్ మళ్ళీ రాజకీయంగా రానున్న తరుణంలో తాలూకాలో ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయంటూ రాజకియ విశ్లేషకులు భావిస్తున్నారు. నారాయణరావు పటేల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నుండి పోటీ చేశారు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ విజయభేరి మోగించడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని ఈ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.




