Wednesday, 4 November 2026

గల్ఫ్ బేకరిని ప్రారంభించిన ఎమ్మెల్యే షిండే

బిచ్కుంద జులై 07 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గురువారం నాడు ఎమ్మెల్యే హన్మంత్ షిండే గల్ఫ్ బేకరిని ప్రారంభించారు. ప్రస్తుతం ఎక్కువ మంది బేకరి సంబంధిత అహరాన్ని ఇష్టపడుతున్నారన్నారు. వెజ్ సంబంధిత కేక్స్ విక్రయించడం మంచిదన్నారు. నాణ్యమైన బేకరి ఉత్పత్తులను అందించాలని బేకరి యదమానిని సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి నాణ్యమైన శుభ్రతతో కూడిన తినుబండారాలు అందించాలని ఆయన కోరారు. కేకులు, కప్ కేకులు, చాక్లెట్ కేకులు, పాస్ట్రిస్, కుకీస్, బ్రెడ్స్, అనేక రకాల చాక్లెట్లు వంటివి అందుబాటులో ఉన్నాయని యజమాని ఖాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అశోక్ పటేల్, నాల్చర్ రాజు, నాగ్నాథ్ పటేల్, పాషా సేట్, నాల్చర్ బాలు, రాజా గౌడ్, బస్వరాజ్ పటేల్, ధన్సింగ్, ముజాహిద్, మరియు గ్రామస్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు.