జుక్కల్ నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే మండలంలోని షెట్లూర్, సీతారాంపల్లి గ్రామాలలో ఇటీవల మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. అనారోగ్యంతో మరణించిన షెట్లూరు గ్రామ హన్మంతరావు మిల్ట్రీ కుటుంబాన్ని మరియు సీతారాంపల్లి విట్టల్ రెడ్డి బిచ్కుంద మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమారుడు ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని మరియు సీతారాంపల్లి గ్రామంలో కర్రోళ్ల పోషబోయి కుటుంబాన్ని పరామర్శించి మీరు ఏమి అధైర్యపడవద్దని నేను మీ కుటుంబాలకు అండగా ఉంటానని వారు భరోసా కల్పించారు మరియు కర్రోళ్ల పోషబోయి గారి కుటుంబానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, ఎన్ రాజు శ్రీహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మండల రైతుబంధు అధ్యక్షుడు బసవరాజు పటేల్, శెట్లూర్ రాజు పటేల్, సర్పంచ్ పుష్ప పండరి సీతారాంపల్లి సర్పంచ్ ర్యాల గంగారెడ్డి, ర్యాల సంగారెడ్డి ఎం విట్టల్ రెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యుడు సంది సాయిరాం తదితరులు పాల్గొన్నారు




