Tuesday, 3 November 2026

కాంగ్రెస్ తోనే దేశం అభివృద్ధి

కాంగ్రెస్ తోనే దేశం అభివృద్ధి : వై ఎస్ గౌడ్ :శామీర్ పేట్, జనం సాక్షి : భారత దేశం అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని శామీర్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. శంకర్ గౌడ్ అన్నారు. గురువారం శామీర్ పేట్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
పురస్కరించుకొని ఇందిరా గాంధీ విగ్రహానికి వై ఎస్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్ రెడ్డి, మహేందర్ యాదవ్, ముజీబ్, లక్ష్మి నారాయణ, బాలరాజ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
29 ఎస్పీటీ -3: ఆవిర్భావ వేడుకల్లో నాయకులు