జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పెట్ గ్రామంలో ఇటీవల కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన వైనాల రాజు , పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా నియమాకమైన రంగు సత్యనారాయణ గౌడ్ , పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ గా నియామకమైన భూoపల్లి రాజయ్య, కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎండి అప్సర్ లను పెంచి కల్ పెట్ గ్రామ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చొప్పరి శేఖర్, ఉపసర్పంచ్ లింగాల కుమార్, మాజీ ఎంపీటీసీ లింగాల రాజయ్య, నాయకులు నూనేటి మల్లికార్జున్, ఇటవేన ఐలయ్య, వంగల సంతోష్, పిడుగు శ్రీనివాస్, పిడుగు వెంకన్న, అనవేన భూమయ్య, మబ్బు శ్రీనివాస్ పల్లె కనకయ్య, , ఇరుగు రాళ్ల శేఖర్ ఇరుగురాళ్ల రాజు అకెనెపల్లి సుధాకర్, ఈక్బాల్, కుక్క రవి, గడ్డం శ్రీనివాస్, చిప్ప రాజ్ కుమార్, కొలిపాక వెంకన్న , మామిడి రాజు తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ నాయకులకు సత్కారం




