కంటోన్మెంట్ జనం సాక్షి మే 02 దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న మృతికి బీఆర్ఎస్ నాయకులే కారణం అని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కంటోన్మంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి కారణమని కంటోన్మెంట్ బోర్డు నామినేట్ సభ్యుడు జే.రామకృష్ణ ఆరోపించారు.మంగళవారం కంటోన్మంట్ బోర్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలని వెల్లడించారు.ఎమ్మెల్యే సాయన్న బతికి ఉన్నప్పుడు కంటోన్మంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో మర్రి రాజశేఖర్ రెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించి సాయాన్నను మానసిక వేదనకు గురైయ్యో విధంగా చేసి వేధించారని రామకృష్ణ అన్నారు.వేదనకు గిరైన సాయన్న ఆసుపత్రి పాలై మృతి చెందారని రామకృష్ణ అన్నారు.బై ఎలక్షన్ వస్తే సాయన్న కుటుంబ సభ్యులు పోటీ చేస్తే భాజపా తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిని పెట్టబోమన్నారు.కంటోన్మెంట్ లోని ఆర్మీ ప్రాంతాలలో రోడ్లు ఓపెన్ అయ్యాయి అంటే అది ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చొరవతో నే అని రామకృష్ణ స్పష్టం చేశాడు. బి.ఆర్.ఎస్ నాయకులు మాటలు చాలించి రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ బోర్డుకు రావలసిన నిధుల తెప్పించలని కోరారు.ఓపెన్ ఐనా రోడ్ల వద్ద బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఫ్యాషన్ షో చేస్తున్నారని సెన్సిటివ్ ప్రదేశంలో ఫ్యాషన్ షో చేయడం వల్ల ఆర్మీ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.ఆర్మీ అధికారులను సిబ్బంది మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలని బీఆర్ఎస్ నాయకులకు రామకృష్ణ సలహా ఇచ్చారు.
దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న మృతికి బిఆర్ఎస్ నాయకులు కారణం




