Tuesday, 3 November 2026

ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి

వీణవంక మే 2 (జనం సాక్షి )వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి సందర్శించి వైద్య సిబ్బందితో ఏర్పాట్లు పరిశీలించారు అనంతరం ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వంలో మహిళలు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం తీసుకొచ్చారు కరీంనగర్ జిల్లాలోని మూడు హాస్పిటల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమని అందులో ఒకటి చల్లూరు కావడం చాలా సంతోషకరం అన్నారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే హాస్పిటల్లో వచ్చి డాక్టర్లను సంప్రదించాలని డాక్టర్ సూచన మేరకు ఆపరేషన్ కొరకు కరీంనగర్ కు వెలెందుకు ప్రభుత్వం ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేశారని వారన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ చందు,ఎంపీడీవో శ్రీనివాస్,ఎంపిటిసి సవిత మల్లయ్య,డాక్టర్ అరుణ, ఐకెపి మహిళలు,ఆశా కార్యకర్తలు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.