కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు..

టేక్మాల్ జనం సాక్షి ఆగస్టు 23 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా టేక్మాల్ మండల కాంగ్రెస్ నాయకులను బుధవారం ఉదయం 5 గంటలకు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ పొలీస్ స్టేషన్లో నిర్బంధించడం బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాసం చేస్తుందన్నారు.త్వరలో మీ పాలనకు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని టేక్మాల్ మండల కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.అరెస్ట్ అయిన వారిలో యువజన కాంగ్రెస్ అద్యక్షులు సంగమేశ్వర్ గౌడ్,మండల కో ఆప్షన్ సభ్యులు మజర్,ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు మహేష్ రెడ్డి,సీనియర్ నాయకులు ఎల్లంపల్లి సత్యనారాయణ, టేక్మాల్ పట్టణ అద్యక్షులు భక్తుల కిషోర్, ఎస్టి సెల్ నాయకులు సేవాలాల్, నాయకులు భిక్షపతి,రామగళ్ల అంజయ్య, తదితరులు ఉన్నారు.