యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ డిసెంబర్31// నిబంధనలకు లోబడి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి యస్ ఐ రాఘవేందర్ గౌడ్ . తుర్కపల్లి మండల ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వేడుకలను ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతున్నాము.
డిసెంబర్ 31 సందర్భంగా మన మండలంలో నాలుగు టీములతో పెట్రోలింగ్ , డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నాము. కావున మద్యం తాగి రోడ్లపై గొడవలు చేసిన, బైక్ మీద అకారణంగా తిరిగిన, వెంచర్లలో, బహిరంగ ప్రదేశాలలో అలాగే ఫామ్ హౌస్ లలో (తోటలలో) సౌండ్ సిస్టమ్స్ పెట్టినా, నిషేధిత మత్తు పదార్థాలు స్వీకరించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాము.
ముఖ్యంగా తల్లితండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండి, ఎలాంటి క్రిమినల్ కేసులలో చిక్కుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోగలరు.




