Wednesday, 4 November 2026

కాంగ్రెస్ నూతన మండల అధ్యక్షురాలు మాకొద్దు.

 

 

 

 

 

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం (జనం సాక్షి )న్యూస్ జులై 07
నూతన కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు మాకొద్దని మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి లు అన్నారు. గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షుల అభిప్రాయాలను సేకరించి మండల అధ్యక్షున్ని ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం బోరెడ్డి జ్యోతి ఎన్నికను మేము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి ఎన్నికను రద్దు చేయాలని, లేని పక్షంలో మండలంలోని కాంగ్రెస్ నాయకులు అందరము ముకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అన్నారు. అదేవిధంగా గాంధీభవన్ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. తుర్కపల్లి మండలంలో చాలా ఎస్టీ జనాభా కలదు ఎస్టీ అధ్యక్షుని తొలగించడం వల్ల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్, ఎంపిటిసిలు కానుగంటి శ్రీనివాస్ యాదవ్,ధనావత్ మోహన్ బాబు నాయక్, దిరవత్ ప్రతిభ రాజేష్ నాయక్, సర్పంచ్ బానోత్ బిచ్చు నాయక్, మండల ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి,మాజీ తుర్కపల్లి సర్పంచ్ సోమళ్ల వెంకటేష్,బీసీ సెల్ అధ్యక్షులు రామగొని వెంకటేష్ గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు అసద్ బెగ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు పట్టు నాయక్, ఎస్సి సెల్ అధ్యక్షులు సొన్నయిల రఘు, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి దొనేకన వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.