Friday, 6 November 2026

కాంగ్రెస్ పార్టీకి నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు,

కాంగ్రెస్ పార్టీకి నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు, మండల అధ్యక్షులు రాజీనామా…

జనం సాక్షి భైంసా రూరల్ నవంబరు 14

నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు పవర్ రామారావు పటేల్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ బి.గంగాధర్ తో పాటు కాంగ్రెస్ గ్రామాల సర్పంచ్ లు,ఎం.పి. టి.సి లు, భైంసా,ముదోల్, బాసర, లోకేశ్వరం, తానూర్, కుబీర్, కుంటల, మండలాల అధ్యక్షులు సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బైంసా పట్టణంలోని స్థానిక ఎస్.ఎస్ జిన్ని0గ్ ఫ్యాక్టరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రామారావు పటేల్ మాట్లాడుతూ… కార్యకర్తల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవడం జరిగిందని, కార్యకర్తలే నాకు ప్రధాన అండ అని పేర్కొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ పై ముందు ముందు వివరణ ఇస్తానని అన్నారు