ఆర్టీసీలోనే సురక్షిత ప్రయాణం
కళాజాతచే ప్రజలకు అవగాహన
గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (14): ఆర్టీసీలోనే ప్రజలు సురక్షిత ప్రయాణం చేయాలని వనపర్తి డిపో మేనేజర్ పరమేశ్వరి అన్నారు సోమవారం డిపో పరిధిలోని గోపాల్ పేట్ మండల కేంద్రంలో ప్రజల వద్దకు ఆర్టీసీ అనే అంశంపై కళాజాత నిర్వహించారు. ఆర్టీసీ గురించి ప్రజలకు కళాకారులు పాటల రూపంలో వివరించారు. ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీలోని ప్రజలు సురక్షితంగా ప్రయాణం అని ఆర్టీసీలో విద్యార్థులకు, వికలాంగులకు, జర్నలిస్టులకు, రాయితీ తో బస్ పాస్ లను అందజేస్తుందన్నారు ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు అన్ని డిపోల పరిధిలో కళాబృందాలుగా ఏర్పడి కళాజాతను నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు. స్థానిక బస్టాండ్ కంట్రోలర్ వెంకటేష్ తో పాటు ప్రజా ప్రతినిధులను డిపో మేనేజర్ శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో డిపో సహాయ మేనేజర్ చంద్రమౌళి, సహాయక ఇంజనీర్ కె.వి రాజశేఖర్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీనివాసులు, కో ఆప్షన్ మతిన్, మాజీ సర్పంచ్ బాలరాజు, కాశీనాథ్, ఆసిఫ్, అరవింద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు




