జోగులాంబ అమ్మవారికి వడ్డేణం బహుకరణ
అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 14) అలంపూర్ లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తమ కుమారుడు శివ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని శ్రీనివాసరెడ్డి దంపతులు తెలిపారు. అనంతరం అమ్మవారికి వెండితో తయారు చేయించిన వడ్డాణం బహుకరించారు.
జోగులాంబ అమ్మవారికి వడ్డేణం బహుకరణ




