మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్ 28కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అన్నారు. బుధవారం కాలనీ నేస్తం-కాంగ్రెస్ హస్తం ప్రచారంలో భాగంగా మౌలాలి డివిజన్ ఎంజె కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను వివరిస్తూ కాలనీలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు,500 కు గ్యాస్ సిలిండర్,నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి,రెండు లక్షల రైతు రుణమాఫీ,5000 పెన్షన్ అందజేస్తామని ప్రచారం చేశారు.కాలనీలో నెలకొన్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వంశీ ముదిరాజ్,సర్కిల్ ఓబిసి కన్వీనర్ వినోద్ యాదవ్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు సానాదిశంకర్,మీడియా కన్వీనర్ గుత్తి రామచందర్, శ్రీనివాస్ గౌడ్,బికే శ్రీనివాస్,కాలనీవాసులు జనార్దన్ రెడ్డి,ఉమా మహేశ్వరి యాదవ్,భాగ్యా రాణి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం.




