Tuesday, 3 November 2026

జిల్లా కలెక్టర్ కార్యాలయాము ముందు నల్ల బ్యాడ్జిల తో నిరసన తెలిపిన ప్రభుత్వ పెన్షనర్స్

గద్వాల నడిగడ్డ, జూన్ 28 (జనం సాక్షి);తెలంగాణా రాష్ట్ర పెన్షనర్ల జేఏసి పిలుపు మేరకు మొదటి దశ నల్లబ్యాడ్జిలతో నిరసన ఆందోళనా కార్యక్రమం బుధవారం గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగింది.విద్య , వైద్య , నీటిపారుదల , రెవెన్యూ , మార్కెటింగ్ , అగ్రికల్చర్ , పంచాయతీరాజ్ , తదితర అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైరైన పెన్షనర్లు నలభై మంది పైగా కదలివచ్చి డెబ్బై , ఎనభై ఏళ్ళు పైబడ్డ వయోవృద్ధులుసైతం వయోభారాన్ని లెక్కచేయకుండా తమను ఎంతగానో కలచివేస్తున్న తమ డిమాండ్ లైననూతన పి.ఆర్.సీ ప్రకటన , ఐ.ఆర్. ఖరారు , బకాయిపడ్డ రెండు డీ.ఏ. లు మంజూరు, బకాయిలన్నీ ఒకేసారి చెల్లింపు ,నెల మొదటి తేదీన పెన్షన్ డబ్బులు ఖాతాల్లో పడడం,నగదురహిత చికిత్స కోసం తక్షణ ఏర్పాట్లు, ఈ.హెచ్.ఎస్ సౌలభ్యం అన్ని శాఖలకు విస్తరణ ఆదేశాలు , విద్రోహకర కొత్తపెన్షన్ విధానం రద్దు , ప్రతిజిల్లాలో రెండు వెల్నెస్ సెంటర్ ల ఏర్పాటు, పెన్షనర్లకు తెలంగాణా ఇన్సెంటివ్ మంజూరు , 398/- వేతనంతో స్పెషల్ టీచర్లుగా వెట్టి చేయించుకున్న కాలానికి నోషనోల్ ఇంక్రెమెంట్లు ఇస్తూ పెన్షన్ బెనిఫిట్స్ మంజూరు లాంటి తమ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నల్లబాడ్జీలు ధరించి ,ఫ్లక్కార్డులు ఎత్తిపట్టి గొంతెత్తి నినదించారు.ప్రభుత్వ స్పందన లేకపోతే రెండవ దశ ఆందోళనా కార్యక్రమంగా జులై 12 న హైద్రాబాద్ లో వేలాది పెన్షనర్లతో మహా ధర్నా జరిపి ఆందోళనల్ని తీవ్రతరం చేస్తామని ఆపరిస్థితి దాపురించకుండా పెన్షనర్ల ఉసురు పోసుకోకుండా మా పెన్షనర్ల జే.ఏ.సి. పెట్టిన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలనితెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.డి.ఇక్బాల్ పాషా , గద్వాల జిల్లా అధ్యక్షులు ఎం.డి.అబ్దుల్ బాబు , ప్రధాన కార్యదర్శి శంకర ప్రభాకర్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో చిట్టి నాగేంద్రం, చంద్రకాంత్ , ఎస్.ఫరీదాబాను ,స్వామిరెడ్డి ,చింతామణి పటేల్ ,దస్తగిరి ,
సుదర్శన్ ,ఏలియా,నర్సింహయ్యశెట్టి ,వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.