గద్వాల నడిగడ్డ, జూన్ 28 (జనం సాక్షి);ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేటు పాఠశాల లో చదివే విద్యార్థుల కు సమానంగా ఇంగ్లీషు భాషలో చదివేందుకు, మాట్లాడే౦దుకు సులభం గా ఉండే విధంగా “టీచ్ ఫర్ చేంజ్ “’అనే కార్యక్రమాన్ని జిల్లా లో ప్రారంభింస్తనట్లు మంచు లక్ష్మీప్రసన్న తెలిపారు.
బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి వచ్చిన మంచు లక్ష్మి ఐడిఓసి లో జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలవగా కలెక్టర్ ఆమెకు బోకే తో స్వాగతం పలికారు.అనంతరం ఐ డి ఓ సి కాన్ఫరెన్స్ హాలు లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆమె సంస్థ గురించి మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా కు రావడం చాలా సంతోషంగా ఉందని, గద్వాల చీరలతో ఈ ప్రాంతం ప్రత్యేకత సంతరించుకున్నదని తెలిపారు. తాము ఇంతవరకు యాదాద్రి జిల్లాలో నిర్వహించిన “టీచ్ ఫర్ చేంజ్” కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని అన్నారు. సరికొత్త బోధనా విధానాన్ని అవలంబిస్తూ విద్యార్థులు సులభంగా ఇంగ్లీషు నేర్చుకునే విదంగా విషయ నిపుణుల ద్వారా బోధనా పద్దతులను రూపొందించి అందిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యా బోధన మూడు స్థాయిలలో జరుగుతుందని, ఒకటి నుండి 5వ తరగతి విద్యార్థులకు వరకుఆంగ్ల బోధన ఉంటుందని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎంపిక చేయబడిన 30 పాఠశాలలకు టీవీ, వాల్ పెయింటింగ్, కార్పెట్స్, బోధన సామాగ్రి అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 30 పాఠశాలలో ఎంపిక చేసినట్లు అగ్రిమెంట్ పై సంతకం చేశారు.జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాను ఎంపిక చేసి విద్యార్థులకు లర్నింగ్ లెవెల్ అభివృధి చేసే ఇటువంటి కార్యక్రమాలను చేపట్టి విద్యాభివ్రుదికి తోడ్పడుతునందుకుఅభినందించారు. ఎంపిక చేసిన పాఠశాల లో ఉండే ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల తల్లి తండ్రులకు సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమ వివరాలు తెలియ చేయాలనీ డీఈఓ కు ఆదేశించారు. అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టి విద్యార్థులకు విద్యనూ అందించడం పట్ల కలెక్టర్ అభినందించారు.జిల్లా విద్యా శాఖాదికారి సిరాజుద్దీన్ మాట్లాడుతూ జిల్లాలో 30 పాఠశాలల ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఏర్పాటు చేసి జిల్లాను ఎంపిక చేసివిద్యభివ్రుదికి సహకరిస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ సంస్థకు మా వంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, డీఈవో సిరాజుద్దీన్, సంస్థ సిబ్బంది చైతన్య, మైథిలి, ధరణి, అధికారులు ఎస్తేరా రాణి తదితరులు పాల్గొన్నారు.
టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచు ప్రసన్న లక్ష్మి




