కాంగ్రెస్ పార్టీలో చేరిన సింగిల్ విండో చైర్మన్జ

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 28 : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని అధికారం పార్టీకి చెందిన ఉమ్మడి కమాన్ సింగిల్ విండో చైర్మన్ ఇనుగంటి భాస్కరరావు శుక్రవారం అర్ధరాత్రి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దుల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీధర్ బాబు స్వయంగా భాస్కరరావు ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైనాల రాజు, మండల కన్వీనర్ ఎస్ఎస్ అన్వర్, కాంగ్రెస్ నాయకులు చొప్పరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.