Wednesday, 4 November 2026

పోటు సత్యనారాయణ కు విప్లవ జోహర్లు

పోటు సత్యనారాయణ కు విప్లవ జోహర్లు

టేకులపల్లి, నవంబర్ 22( జనం సాక్షి): సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఖమ్మం నగర కార్యదర్శి, ఖమ్మం సబ్ డివిజన్ కమిటీ సభ్యుడు, ఐ ఎఫ్ టి యు ఖమ్మం ఏరియా కార్యదర్శిగా పనిచేస్తున్న పోటు సత్యనారాయణ కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ గత రాత్రి అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల కొత్తగూడెం డివిజన్ పివైఎల్ కార్యదర్శి నోముల భానుచందర్ దిగ్బ్రాంతి గురై ఆయనకు విప్లవ జోహార్లు తెలిపారు. పోటు సత్యనారాయణ గత 40 సంవత్సరాల నుండి అనేక ప్రజా ఉద్యమ లతో పాటు యువజన సంఘం పి వై ఎల్ లో అనేక సంవత్సరాలు పనిచేసి తన వంతు పాత్రని పోషించారన్నారు. ఆయన స్వగ్రామం ఇల్లందు మండలం నిజంపేట వాస్తవ్యుడని, కా..పోటు సత్యనారాయణ అనేక నిర్బంధాలు కూడా ఎదుర్కొన్నారన్నారు. అనేక ఇబ్బందులు వెంటడుతున్నా తన తుది శ్వాస వరకు పార్టీని అంటూ పెట్టుకొని సుదీర్ఘంగా పనిచేశారన్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు, కార్మిక ఉద్యమాలకు తీవ్ర లోటని, ఆయనకు సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ టేకులపల్లి మండల కమిటీ విప్లవ జోహార్లు అర్పించారు. బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, సానుభూతిని తెలుపుతున్నారన్నారు.