Sunday, 8 November 2026

కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో నిరసన కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో నిరసన కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో నిరసన తహశీల్దార్ కు మేమోరాండం
గంగారం నవంబరు 24 (జనం సాక్షి) గంగారం మండల కేంద్రంలో  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆదేశాలమేరకు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పిలుపులో భాగంగా గంగారం మండల కాగ్రేస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెనుకా పురుషోత్తం       అద్వర్యంలో  నిరసన  తహశీల్దార్ కు మేమోరాండం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సువర్ణపాక సరోజన ముడిగే వీరభద్ర మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతంగం పై జరుగుతున్న నష్టాన్ని వివరించారు రైతుల సమస్యలను పరిష్కరించలి , ధాన్యం కొనుగోలు చేయాలి, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి పోడు సాగుదారులకు పట్టా కల్పించాలి , రైతు రుణమాఫీ చేయాలి  ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు గిరిజనులతో పాటు గిరిజననేతరులకు పోడుభూములకు పట్టాలివ్వాలి ధరణి పోర్ట్ రద్దు చేయాలని స్థానిక గంగారం తహశీల్దార్ కు మేమోరాండం అందచేశారు ఈ కార్యక్రమంలో జెడ్పిసి జెడ్పిటిసి ఈసం రమ  ప్రధాన కార్యదర్శి రాధారపు కొమురయ్య, కో ఆప్షన్ ఎస్.కె సయ్యద్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు పోతయ్య బాలు కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు నర్సక్క ఎన్ రోలర్ రామస్వామి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు