కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పై పోరుబాట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పై పోరుబాట
మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (24): మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలును పరిష్కరించాలని రైతులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి మండల అధ్యక్షులు గణేష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కు రైతు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని,లేదా భూ సమస్యలు సవరణలు చేసుకోవడానికి ఈ పోర్టల్ లో ఆప్షన్ ఇవ్వాలని,అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి రైతు రుణమాఫీ చెయ్యని కెసిఆర్ ప్రభుత్వం తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు,అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని,అదేవిధంగా ఆరుకాలం కష్ట పడి రైతు పండించిన పంట అకాల వర్షాలకు పంటలు తడిసి నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇవ్వాలని,కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, గ్రామ అధ్యక్షుడు శివన్న బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగన్న గౌడ్ ,మాజీ ఎంపిటిసి బాలయ్య, చాకలి పల్లి సర్పంచ్ నరహరి, వార్డు సభ్యుడు వెంకటయ్య, పూసల లక్ష్మణ్,రాజేశ్వరరావు, రాములు, కిషోర్, దేవరాజు, శ్రీనివాసులు, శాంతయ్య ,రైతులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పై




