Thursday, 5 November 2026

పంచాయతీ కార్యదర్శులకు అవగాహన ,సీఈఓ సురేష్

పంచాయతీ కార్యదర్శులకు అవగాహన ,సీఈఓ సురేష్
, ఫోటో రైట్ అప్ అవగాహన కల్పిస్తున్న జెడ్పి సీఈవో సురేష్

పెన్ పహాడ్ . నవంబర్ 23 (జనం సాక్షి) : మండల కేంద్రంలో గ్రామపంచాయతీలకు నేషనల్ అవార్డ్స్ సంబంధించిన అవగాహన సదస్సు మండల పరిషత్ కార్యాలయంలో సీఈఓ జి సురేష్ అవగాహన సమావేశం బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు సక్రమంగా ఎటువంటి తప్పిదాలు లేకుండా గ్రామాలలో చూసుకోవాలని సూచించారు గ్రామాలలో జరిగిన అభివృద్ధిపై ఉన్నంత అధికారులు పరిశీలించి నేషనల్ అవార్డ్స్ ను గ్రామాలను ఎంపిక చేయటం జరుగుతుందని ఆయన అన్నారు గ్రామాలలో గ్రామపంచాయతీ పన్నులను 100% వసూలు చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాణాల శ్రీనివాస్, ఎంపిఓ నరేష్, కంప్యూటర్ ఆపరేటర్స్ ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.