Wednesday, 4 November 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం

 కుబీర్ జనం సాక్షి  జిల్లా కుబీర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామారావు పటేల్ పైన డి1 పట్టా భూములు చేసుకున్నారని అధికార పార్టీ వారు చేసిన వ్యక్తిగత ఆరోపనలు చేయడం సిగ్గుచేటు అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ఈ ఆరోపణలు అవాస్తవమని ఒకవేళ రామారావ్ పటేల్ డి1 పట్టా భూమి ఒక గుంటా భూమైనా చేసుకుని ఉంటే బాసరలో అమ్మవారి సాక్షిగా ప్రజావేదిక పెట్టండి. మీరు సాక్ష్యాలు చూపిస్తే మా అధ్యక్షులు రామారావు పటేల్ రాజకీయ సన్యాసం తీసుకుంటారని, ఒకవేళ అబద్ధం, అవాస్తవం అని తేలితే మీ ఎమ్మెల్యేకు తన పదవికి రాజీనామా చేసే దమ్ముందా అని నీలాదీశారు. బాసర ఐఐఐటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అధికార పార్టీ వారు డబ్బులు తీసుకున్నమాట నిజం కాదా అని నీలాదీశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బాసర పర్యటన తర్వాతనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని అన్నారు. ఈ సందర్బంగా కందూర్ సాయినాధ్ (చోటా), కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ వి. నాగేష్ , ప్యాట లక్ష్మణ్ ,గులాబ్ నాయక్ , మాజీ మండల ఉపాధ్యక్షులు శంకర్ , సిర్పెల్లి సర్పంచ్ రాజేందర్ , మైనారిటీ సెల్ అధ్యక్షులు జావీద్ ఖాన్ , బెల్గాం తండా సర్పంచ్ అనిల్ , యూత్ అధ్యక్షులు కనకయ్య , నాగేందర్ , పోగుల లింగన్న తదితరులు పాల్గొన్నారు.