Saturday, 7 November 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ వినత్పత్రం అందజేత

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ వినత్పత్రం అందజేత

రాజంపేట్ జనంసాక్షి నవంబర్ 24

మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగారాజంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాదవ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏకకాలంలో రుణమాఫీ పథకం అమలు చేయలని ధరణి పోర్టల్ రద్దు చేయాలని పోడు భూముల సమస్య, మిగులు భూముల సమస్యను పరిష్కరించాలని తహసిల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కే బాలకిషన్, కే వీరన్న, రాజంపేట్ పట్టణ అధ్యక్షులు గంగాధర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ జూకంటి సుధాకర్ రెడ్డి, శివకుమార్, రాములు, శ్రావణ్ రెడ్డి, పీరియ నాయక్, సిద్ధిరాములు, యూత్ అధ్యక్షులు షాదుల్ అలీ, వార్డ్ నెంబర్ ఇమ్రాన్ హాలీ, బాలరాజు, భీమయ్య, సైదయ్య, సురేష్, మరియు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.