Sunday, 8 November 2026

తూప్రాన్ మున్సిపల్ అభివృద్ధికి 23 కోట్లు మంజూరు

తూప్రాన్ మున్సిపల్ అభివృద్ధికి 23 కోట్లు మంజూరు తూప్రాన్ జనం సాక్షి నవంబర్ 24:: తూప్రాన్ మున్సిపల్ పరిధిలో సిమెంట్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు 23 కోట్లు మంజు ప్రయాణి టెండర్ దశ పూర్తి కాగానే పనులు త్వరలో ప్రారంభమవుతాయని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ తెలిపారు తూప్రాన్ మున్సిపాలిటీ 11వ వార్డు పాడాల్ పల్లి లో విలేజ్ ఎంట్రెన్స్ లో డివైడర్ మరియు బటర్ఫ్లై లైట్ల సుందరీకరణ పనుల కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు తూప్రాన్ మున్సిపల్ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కృషి వల్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుటనున్నట్లు ఆయన తెలిపారు గతంలో ఎన్నటికి లేని విధంగా తూప్రాన్ పట్టణాన్ని ఆదర్శవంత మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని ఇంకా అభివృద్ధి పనులు చాలా జరగాల్సి ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్,కమిషనర్ మోహన్ 11వార్డు కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ గౌడ్ , కౌన్సిలర్ తలారి మల్లేష్, నాయకులు లంబ వెంకటేష్,గౌతమ్ గౌడ్,యాదగిరి, శ్రీనివాస్, నాగరాజు, రాజు,యూత్ నాయకులు, గ్రామ పెద్దలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు