టేకులపల్లి, జనవరి 26( జనం సాక్షి ): టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో 74 వ గణతంత్రం దినోత్సవం వేడుకలు గురువారంఘనంగా నిర్వహించారు. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం సిద్ధించటానికి ఎందరో దేశనాయుకులు, మహనీయులు చేసిన త్యాగాలు ఏన్నటికీ మరువలేనిదని, వారి త్యాగాల ఫలితమే ఈ రోజు దేశ ప్రజలు స్వేచ్ఛ జీవితం అనుభవిస్తూనారని మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్య దేవానాయక్ అన్నారు. ఈ కార్యా క్రమం లో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూక్య దళ్ సింగ్ నాయక్,మహిళా మండల అధ్యక్షురాలు స్వప్న, కిసాన్ సెల్ రాష్ట్ర కో- అర్దేనేటర్ చంద్రకళ, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ రాసమళ్ళ నరసయ్య, వీసం శ్రీనివాస్‌రావు, ఈసం ప్రసాద్, భూక్య బన్సీలాల్, రవీందర్ సింగ్, లూణావత్ భద్రు,అజ్మీరా సూక్య, రమేష్ బాబు,బానోత్ లఖపతి ఉండేటి ఇరిమియా తదితరులు పాలొగొన్నారు.




