Wednesday, 4 November 2026

నిరుపేద వైద్య విద్యార్థికి ఆర్థిక సాయం.

 

 

 

 

 

 

బెల్లంపల్లి, జనవరి 26, (జనంసాక్షి )బెల్లంపల్లి మండలం బట్వానపల్లి గ్రామానికి చెందిన దుర్గం పద్మ-లక్ష్మణ్ కుమారుడు దుర్గం అనిరుధ్ కి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేయుతనందించారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చినందున ఆయన విద్యాభ్యాసం కోసం డిఎంఎఫ్టి నిధుల నుండి మంజూరైన రూ.4 లక్షల 11 వేల రూపాయల చెక్కును గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.