– జిల్లా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి శంకర్, పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్
సూర్యాపేట ప్రతినిధి , జనవరి 26 (జనంసాక్షి): భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికి స్వేచ్చ,సమానత్వం, సమాన హక్కులు,అవకాశాలు కల్పించిందని జిల్లా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి శంకర్, పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గండూరి కృపాకర్ అన్నారు.గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ భవనంలో జరిగిన కార్యక్రమంలో వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు.బిఆర్ఎస్ పాలనలో పేదలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని అన్నారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని, సూర్యాపేట జిల్లా కేంద్రంలో వ్యాపార రంగం విస్తరించిందని అన్నారు.మెరుగైన శాంతిభద్రతలతో పట్టణంలో వ్యాపారులు, ఉద్యోగులు ప్రశాంతంగా జీవిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ , సింగిరికొండ ప్రదీప్ కుమార్ , సయ్యద్ షఫి , ఎలగందుల సుదర్శన్ , దూలం నగేష్ , బొమ్మగాని సైదులు , తేలుకుంట్ల వెంకటేశ్వర్లు , అనంతుల రాజేశ్వర్ , పావని యాదగిరి, మల్లు వెంకట్రామ రెడ్డి, కొండపల్లి లక్ష్మారెడ్డి , నూకల వెంకటరెడ్డి , గుండా లక్ష్మయ్య , తెరటపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.




