నెన్నెల, ఫిబ్రవరి 7, (జనంసాక్షి )ఏఐసీసీ పిలుపు మేరకు నెన్నెల మండల కేంద్రంలో సోమవారం హత్ సే హత్ జోడో అభియాన్ యాత్ర గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు మల్లేష్ ప్రారంభించారు. నెన్నెల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశాన్ని ఐక్యం చేయుటకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేపట్టారని, జోడో యాత్ర ముగింపు సందర్భంగా ఆయాత్రకు కొనసాగింపుగా రోజు రాష్ట్రమంతా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం, రాహుల్ గాంధీ గారి సందేశం గడప గడపకు చేరవేయడానికి ఈకార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నేడు దేశంలో విద్వేషం, విభజన, ప్రజల మధ్య చిచ్చు రేపి అధికారం కోసం అడ్డదారులు తొక్కడం అంత్యంత హేయమైన చర్య అని, అలాగే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అవినీతి చేస్తూ, కుటుంబ పాలన చేస్తూ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరకముందే జాతీయ పార్టీ పెట్టి మరోసారి సెంటిమెంట్ తో రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఈ సారి అధికారంలోకి తీసుకొని వచ్చి సోనియమ్మ రుణం తీర్చుకోవాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకకులు సింగతి తిరుపతి, గుండ్ల సోమారం ఎంపీటీసీ దాగం రమేష్, కంపెల రమేష్, సింగల్ విండో డైరెక్టర్ ఉయ్యాలవాడ లింగయ్య, లావుడ్య రమేష్, రాజన్న యాదవ్, గడ్డం శ్రీనివాస్, గట్టు బానేష్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, ఎనగంటి మధుకర్ రెడ్డి, బిక్య నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.




