Tuesday, 3 November 2026

మొక్కుబడిగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు

జనం సాక్షి/ కొల్చారంతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ఆదేశించి ప్రత్యేకంగా నిధులు విడుదల చేసినప్పటికీ కొల్చారం మండలంలో దశాబ్ది ఉత్సవాలు మొక్కుబడిగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రమైన కొల్చారం లోని ఏ ప్రభుత్వ కార్యాలయం వద్ద స్వాగతం తోరణాలు గాని విద్యుత్ దీపాల అలంకరణ గాని కనిపించలేదు. మండల స్థాయి అధికారులు మొక్కుబడిగా జాతీయ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవం అయిందనిపించారు. మండల ప్రత్యేక అధికారి ఆయన జిల్లా యువజన సంక్షేమ అధికారి నాగరాజు ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ మంజుల కాశీనాథ్ తాసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ చంద్రశేఖర రావు మండల వనరుల కేంద్రం వద్ద ఎంపీడీవో గణేష్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద ఏవో శ్వేత కుమారి,మండల మహిళా సమాఖ్య వద్ద ఏపీఎం సుశీల్వ, పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ గ్రామపంచాయతీ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలంలోని ఆయా గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ పతాకరణ ఆవిష్కరించారు.