Tuesday, 3 November 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 02 బోయినపల్లి హస్మత్ పేట చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహం వద్ద కూకట్ పల్లి కాన్స్టెన్సీ ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ కావేటి మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ సత్యం శ్రీరంగం,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ దుండగుల యాదగిరి,ఏ బ్లాక్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలవేసి, తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఐదు కోట్లమంది ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని ఆంధ్ర రాష్ట్రం లో పార్టీ మనుగడ కోల్పోతుందిఅని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు సోనియా గాంధీ కి రుణపడి ఉండాలనీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకోని వచ్చి సోనియా గాంధీ కి బహుమతి గా తెలంగాణ ప్రజలు ఇవ్వాలి అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు,నియామకాలు వస్తాయి అనుకుంటే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఏ కోరిక నెరవేరలేదు.తెలంగాణ ప్రజల కోరికలు నెరవేరాలి అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుంది.కచ్చితంగా మనం అందరం కృషి చేసి తెలంగాణ లో బిఆర్ఎస్ పాలనకి చేరామ గీతం పడి మన కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకు రావాలనీ అన్నారు.ఈ కార్యక్రమంలో అయూబ్ ఖాన్,షరీఫ్ ఉద్దీన్,వి.మోహన్ బాబు, బాలయ్య ముదిరాజ్,మోయిజ్, అక్బర్,ఎరుమళ్ల రమేష్,బి.సతీష్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.