Tuesday, 3 November 2026

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోనియాగాంధీ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కురివి జూన్/ 2/జనం సాక్షి న్యూస్ : కురవి మండలకేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ, కురవి టౌన్ అధ్యక్షుడు నారాయణ రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షుడు రాజేంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ కొరకు ఆత్మబలిదానం చేసుకున్న విద్యార్థులను చూసి చలించిపోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగిందిఅన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆమెని తెలంగాణ ఇచ్చిన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఆమెకు పాలాభిషేకం చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తరాల వీరభద్రం, మండల కార్యదర్శి మిర్యాల లక్ష్మయ్య, పార్టీ సీనియర్ నాయకులు సూరం మల్లారెడ్డి, ప్రసాద్, గ్రామ ఉపాధ్యక్షులు కామిండ్ల ఆనందం, బీసీ సెల్ మండల అధ్యక్షులు చిన్నం గణేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కామెంట్ల వీరన్న,పార్టీ సీనియర్ నాయకులు చిన్నం శ్రీనివాస్, కత్తి వెంకన్న, తరాల వీరన్న, దైవ వీరయ్య, పిలిచేతండ గ్రామ అధ్యక్షులు బాలాజీ నాయక్, రవి నాయక్, భూక్య బాలాజీ, గ్రామ కిసాన్ సేల్ అధ్యక్షుడు బెడద విశ్వనాథం, పరిపూర్ణాచారి,అంగడి నరసయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.