కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై చేసిన దాడిని ఖండించిన పట్టణ మహిళా అధ్యక్షురాలు భవిత రాణి*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 15,
జనం సాక్షి :
మెట్ పల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అందె భవిత రాణి పట్టణంలో పార్టీ కార్యాలయ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీసులు దాడి పట్ల తీవ్రంగా ఖండించారు , టిఆర్ఎస్ పార్టీ కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై దాడులు పోలీసుల ద్వారా చేస్తుందని ,
కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బాధ్యతగా, కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా సిద్ధంగా ఉండాలని, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ,ఇటువంటి దాడి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదని అధికారం లు ఉంటాయి కానీ శాశ్వతం అనుకోవద్దని అన్నారు ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని ఈ సందర్భంగా అన్నారు
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై చేసిన దాడిని ఖండించిన పట్టణ మహిళా అధ్యక్షురాలు భవిత రాణి




