Thursday, 5 November 2026

కామారెడ్డి జిల్లా కెంద్రంలొ

కామారెడ్డి జిల్లా కెంద్రంలొ
మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూములను ఇండస్ట్రియల్ పేరుతో ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదు..
-టిపిసిసి ఉపాధ్యక్షులు మదన్మోహన్
కామారెడ్డి ప్రతినిధి డిసెంబర్15 (జనంసాక్షి);
మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూములను ఇండస్ట్రియల్ పేరుతో ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని టిపిసిసి ఉపాధ్యక్షులు మదన్మోహన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పై ఫైర్ అయ్యారు. పేద రైతులకు అన్యాయం జరుగుతే ఊరుకునేది లేదని, రైతుల పక్షాన తాను ఉంటానని, రైతులు భూములు కోల్పోతుంటే ఎమ్మెల్యేగా ఉండి స్పందించాల్సిన నువ్వు ఇండస్ట్రియల్ పేరుతో డ్రామాలు ఆడితే ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సురేందర్ తన వైఖరిని మార్చుకోవాలి సూచించారు.