Wednesday, 4 November 2026

కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతి రెడ్డికి తేనేటి విందు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రేసిడెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అమేర్ అబ్దుల్లా.
తాండూరు అక్టోబర్ 7(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రేసిడెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అమేర్ అబ్దుల్లా నివాసంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తిరుపతి రెడ్డికి పట్టణంలోని తన నివాసంలో తేనేటి విందును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి హాజరై తేనేటి విందును స్వీకరించారు.తాండూర్ లో జరుగుతున్న రాజకీయ పరినామాలపై కాసేపుచర్చించారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుప లక్ష్యంగా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.తుక్కుగూడలో ప్రవేశ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా అమేర్ అభిలాల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించు కోవాలని ఆయన తెలిపారని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి మైనార్టీ వైస్ చైర్మన్ ఖలీద్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ హాది,షరీఫ్ సాబ్ తోపాటు తదితరులు ఉన్నారు.