డోర్నకల్ మే /4 :జనం సాక్షి న్యూస్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల గ్రామంలో అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ గద్దెను కూల్చడం చాలా సిగ్గుచేటు అని రాబోయే ఎన్నికల్లో ఢీకొట్టే దమ్ము లేకనే విధ్వంసాలకు పాల్పడుతున్నారని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ అన్నారు. గురువారం గొల్లచర్ల ఎక్స్ రోడ్ నుండి గ్రామపంచాయతీ వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి కూల్చిన గద్దెను ఆయన పరిశీలించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎవరిని ఈడ్చి పెట్టేది లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తగిన బుద్ధి చెప్తావని మాలోత్ నెహ్రూ నాయక్ అన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడుగా పని చేయాలని ఎవరు ఆ దైర్య పడద్దని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు డిఎస్ జగదీష్, మాజీ ఎంపిటిసి బానోత్ శంకర్ నాయక్, భానోత్ శ్రీను నాయక్, భానోత్ దేవ్ సింగ్ నాయక్, హరికృష్ణ, రాజేందర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మోహన్, శంకర్, మాలోత హరిలాల్, వివిధ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





