Wednesday, 4 November 2026

వీణవంక లో మండల కేంద్రంలో 29వ ఎమ్మార్పీఎస్ జెండా వేడుకలు ఘనంగా జరిగాయి

 

 

వీణవంక జులై 7 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అవిర్బా జెండా వేడుకలు ఘనంగా గాజుల రామయ్య ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి సీట్లు పంపించేశారు అనంతరం వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ మాదిగలు మరియు ఉప కులాల ఆకాంక్షమైన ఎస్సీ ఏబిసిడి ల వర్గీ కరణ కోరకు 28 సంవత్సరాల నుండి శాంతియుతంగా సుధీర్గ పోరాటం చేస్తున్న అధికారం లో ఏ ప్రభుత్వం ఉన్న న్యాయమైన డిమాండ్ ను గుర్తించడం లేదు. ఇకనైన ప్రభుత్వాలు మేలు కొని ఓటు రాజకీయం చేయడం మానుకొని నిరు పేద కులాలకు న్యాయం చేయాలని ఈ జెండా పండుగ సందర్భంగా డిమాండు చేస్తున్నాము అడుగకుండా, పోరాటాలు చేయకపోయినా ఓసి లకు 10% రిజర్వేషన్ ఇచ్చినారు. మేము కాలే కడుపులతో రోడ్డెక్కి పోరటాలు చేస్తే ఈ ప్రభుత్వం కూడా గుర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మధువయ్య, తిరుపతి, రాజేష్, పులి ప్రకాష్, మహేందర్, స్వామి, చందు రాజేష్, మధు ,సతీష్, తోపాటు తదితరులు పాల్గొన్నారు..